దారి ఘోరం.. ప్రయాణం ప్రమాదకరం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:32 AM
జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలో కొత్తగా నిర్మించిన మాదిమళ్లు వంతెన వద్ద రోడ్డు ప్రస్తుతం బురదమయమైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇది చిత్తడిగా మారింది. దీంతో ఇటుగా రాకపోకలు సాగించే సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
బురదమయంగా మాదిమళ్లు వంతెనకు వెళ్లే రోడ్డు
- అదుపు తప్పుతున్న వాహనాలు
- 50 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు
సీలేరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలో కొత్తగా నిర్మించిన మాదిమళ్లు వంతెన వద్ద రోడ్డు ప్రస్తుతం బురదమయమైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇది చిత్తడిగా మారింది. దీంతో ఇటుగా రాకపోకలు సాగించే సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
మండలంలో 2024 సెప్టెంబరు 8న వచ్చిన పెను తుఫాన్‌కు మాదిమళ్లు వంతెన కొట్టుకుపోయింది. దీంతో అధికారులు ఈ వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టి ఇటీవలే పూర్తి చేశారు. అయితే ఈ వంతెనకు అటు, ఇటు తారురోడ్డు నిర్మించకుండా ఎర్ర మట్టి వేసి వదిలేశారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఈ రోడ్డు బురదమయమైంది. దీంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. దీని వల్ల ఈ వంతెన గుండా రాకపోకలు సాగించే సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారు రోడ్డు నిర్మించాలని ధారకొండ, గుమ్మిరేవుల పంచాయతీలకు చెందిన పలు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.