Share News

ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 471 మిలియన్‌ యూనిట్లు

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:58 PM

సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి ఈ ఏడాది(2026- 2027 సంవత్సరానికి) సెంట్రల్‌ విద్యుత్‌ అధారిటీ ఉన్నతాధికారులు 471 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారని ఏపీ జెన్‌కో సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 471 మిలియన్‌ యూనిట్లు
సీలేరు జల విద్యుత్‌ కేంద్రం

ఏపీ జెన్‌కో సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్‌

సీలేరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి ఈ ఏడాది(2026- 2027 సంవత్సరానికి) సెంట్రల్‌ విద్యుత్‌ అధారిటీ ఉన్నతాధికారులు 471 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారని ఏపీ జెన్‌కో సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో రెండవ దశ నిర్మాణ పనుల నేపథ్యంలో రెండు నెలలపాటు సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేయడం వల్ల గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయామన్నారు. సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉండడం వల్ల రోజుకు 1.5 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 196 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఈ ఏడాది సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించిన గడువు కన్నా ముందే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Jul 22 , 2026 | 10:58 PM