Share News

వలలు నిండుతున్నాయ్‌!

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:12 AM

రెండు నెలల విరామం తర్వాత సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా తిరిగి జెట్టీకి చేరుకుంటున్నాయి.

 వలలు నిండుతున్నాయ్‌!

పూర్తిస్థాయి వేటతో మత్స్యకారుల కళ్లలో ఆనందం

రెండు నెలల విరామం తర్వాత సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా తిరిగి జెట్టీకి చేరుకుంటున్నాయి. వలలనిండా రొయ్యలు, పీతలు, వివిధ రకాల చేపలతో మత్స్యకారుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. విక్రయాలు ప్రారంభం కావడంతో వినియోగదారులు, వ్యాపారులు, మత్స్యకారులతో హార్బర్‌ కళకళలాడుతోంది. ప్రస్తుతం రొయ్యల దిగుబడి బాగుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా బోట్లు వేటకు వెళ్లగా, మిగిలినవి మరో రెండు రోజుల్లో బయలుదేరుతాయని చెబుతున్నారు.

- బీచ్‌రోడ్డు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 22 , 2026 | 01:12 AM