Share News

మైమరిపించిన మంచు అందాలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:58 PM

అరకులోయలో సహజసిద్ధ ప్రకృతి అందాలతోపాటు పొగమంచు సోయగం పర్యాటకులను ఆకర్షించింది.

మైమరిపించిన మంచు అందాలు
గన్నెల జంక్షన్‌ వద్ద సందర్శకులను కనువిందుజేస్తున్న మంచు మేఘాలు

గన్నెల జంక్షన్‌, మాడగడల్లో పాల సముద్రాన్ని

తలపించిన మంచు అందాలు

అరకులోయ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

అరకులోయలో సహజసిద్ధ ప్రకృతి అందాలతోపాటు పొగమంచు సోయగం పర్యాటకులను ఆకర్షించింది. అరకులోయ పరిసర ప్రాంతాలపై శనివారం మంచు ముసుగేసింది. ఓ వైపు వలిసి పూల అందాలు, మరో వైపు మంచు సోయగం సందర్శకులను మైమరపించింది. గన్నెల జంక్షన్‌ వద్ద, మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ లోయంతా మంచు మేఘాలు పాల సముద్రాన్ని తలపించింది. మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయించే సూర్యోదయం సందర్శకులను మంత్రముగ్ధుల్నిజేసింది. పలువురు సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ధింసా కళాకారులతో నృత్యాలు చేశారు. సుంకరమెట్ట కాఫీట్రైయల్‌ వద్ద కెనోపివాక్‌ చేస్తూ సందర్శకులు ఎంజాయ్‌ చేశారు. అదేవిధంగా అరకులోయలో ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌లను పర్యాటకులు సందర్శించారు.

Updated Date - Nov 28 , 2026 | 11:58 PM