వేధిస్తున్న డీజిల్ కొరత
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:49 PM
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులుగా డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదని బంకుల నిర్వాహకులు చేతులెత్తేశారు.
వాహన చోదకుల అగచాట్లు
పెట్రోల్ బంకుల వద్ద నిరీక్షణ
నక్కపల్లి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులుగా డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదని బంకుల నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో పలు బంకుల వద్ద అనేక వాహనాలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి వేంపాడు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం అనేకమంది పడిగాపులు కాశారు. ఆటోలు, ట్రాక్టర్లతో గంటల పాటు నిరీక్షించారు. డీజిల్ లేదని, తామేమీ చేయలేమని సిబ్బంది తేల్చి చెప్పేశారు. నక్కపల్లిలో వున్న పెట్రోల్ బంకు వద్ద శనివారం మధ్యాహ్నం నుంచి డీజిల్ వాహనాలు రాకుండా స్టాపర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆటోల డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు.