Share News

‘స్థానిక’ కోలాహలం

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:04 AM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అనకాపల్లిలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంతోపాటు అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద జాతర వాతావరణం కనిపించింది. రాజకీయ పార్టీల తరపున, స్వతంత్రులుగా నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో ఆయా కార్యాలయాల పరిసరాలు కోలాహలంగా మారాయి. గ్రామాల నుంచి అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పలు వాహనాల్లో ఊరేగింపుగా నామినేషన్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

‘స్థానిక’ కోలాహలం
రావికమతంలో నామినేషన్లు వేయడానికి ర్యాలీగా వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు

జడ్పీటీసీ, ఎంపీటీసీలకు భారీ ఎత్తున నామినేషన్ల దాఖలు

జిల్లా ప్రాదేశికాలకు 290, మండల ప్రాదేశికాలకు 2,695 నామినేషన్లు దాఖలు

చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల బలప్రదర్శన

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు

నేడు నామినేషన్ల పరిశీలన

25న అప్పీళ్లకు అవకాశం, 26న అప్పీళ్ల పరిశీలన

27న ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు విడుదల

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అనకాపల్లిలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంతోపాటు అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద జాతర వాతావరణం కనిపించింది. రాజకీయ పార్టీల తరపున, స్వతంత్రులుగా నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో ఆయా కార్యాలయాల పరిసరాలు కోలాహలంగా మారాయి. గ్రామాల నుంచి అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పలు వాహనాల్లో ఊరేగింపుగా నామినేషన్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకాగా.. 23వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. జిల్లాలో 24 జడ్పీటీసీ, 427 ఎంపీటీసీ స్థానాలు వున్నాయి. జడ్పీటీసీలకు మూడు రోజుల్లో 290 నామినేషన్లు, ఎంపీటీసీలకు 2,695 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు రెట్టింపు సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం విశేషం. జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా పరిశీలిస్తే, బీఎస్‌పీ 5, బీజేపీ 21, సీపీఎం 8, కాంగ్రెస్‌ 11, జనసేన 57, టీడీపీ 100, వైసీపీ 77, ఇతరులు 3, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే.. బీఎస్పీ 1, బీజేపీ 75, సీపీఎం 16, కాంగ్రెస్‌ 7, జనసేన 404, టీడీపీ 989, వైసీపీ 1,127, ఇతరులు 5, స్వతంత్రులు 102 నామినేషన్లు దాఖలు చేశారు.

అత్యధికంగా అచ్యుతాపురం మండలంలో 176 నామినేషన్లు, అత్యల్పంగా నర్సీపట్నం మండలంలో 32 నామినేషన్లు దాఖలాయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. చోడవరంలో 517, ఎలమంచిలిలో 488, పాయకరావుపేటలో 436, మాడుగులలో 396, నర్సీపట్నంలో 376, అనకాపల్లిలో 249, పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాల్లో 233 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు సాయంత్రం ఐదు గంటలతో గడువు ముగిసింది. కానీ పలు మండలాల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వుండడంతో సమయం ముగిసిన తరువాత కూడా నామినేషన్లను స్వీకరించారు. అయితే ఐదు గంటలకు అభ్యర్థులందరినీ కార్యాలయం లోపలికి రప్పించి గేట్లు మూసేశారు. కొన్నిచోట్ల రాత్రి ఏడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.

నామినేషన్ల కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించారు.

ఎంపీటీసీలకు ఏ మండలంలో ఎన్ని నామినేషన్లు

నర్సీపట్నం 32, గొలుగొండ 103, నాతవరం 131, మాకవరపాలెం 110, పాయకరావుపేట 118, కోటవురట్ల 90, నక్కపల్లి 127, ఎస్‌.రాయవరం 101, అనకాపల్లి 145, కశింకోట 104, అచ్యుతాపురం 176, ఎలమంచిలి 52, రాంబిల్లి 124, మునగపాక 136, మాడుగుల 120, కె.కోటపాడు 89, దేవరాపల్లి 117, చీడికాడ 70, చోడవరం 156, బుచ్చెయ్యపేట 125, రావికమతం 121, రోలుగుంట 115, పరవాడ 86, సబ్బవరం 147

Updated Date - Oct 24 , 2026 | 01:06 AM