Share News

అప్పన్న హుండీల ఆదాయం రూ.1.08 కోట్లు

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:10 AM

వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 14 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.08 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నున్న సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది సింహగిరిపై పరకామణి కేంద్రంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు.

అప్పన్న హుండీల ఆదాయం రూ.1.08 కోట్లు

సింహాచలం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 14 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.08 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నున్న సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది సింహగిరిపై పరకామణి కేంద్రంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. రూ.1,08,36,662 కోట్లు నగదు రూపంలో లభించగా, ఆభరణాల రూపంలో స్వర్ణం 21.65 గ్రాములు, 5.6 కిలోల రజతం సమకూరాయి అలాగే 91 యూఎస్‌ఏ డాలర్లు, 520 యూఏఈ ధీరమ్స్‌, భూటాన్‌, ఒమన్‌, నేపాల్‌, ఖతార్‌, న్యూజిలాండ్‌, మలేషియా, తదితర దేశాలకు చెందిన కరెన్సీ కూడా ఖజానాకు చేరింది.

Updated Date - Jan 08 , 2026 | 01:10 AM