Share News

రిజిస్ర్టేషన్లపై మౌఢ్యమి ప్రభావం

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:21 AM

మౌఢ్యమి కారణంగా గత 40 రోజుల నుంచి భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ర్టేషన్లు బాగా తగ్గిపోయాయి. నవంబరు 29వ తేదీ నుంచి మౌఢ్యమి ప్రారంభం కావడంతో ముఖ్యమైన రిజిస్ర్టేషన్లను క్రయవిక్రయదారులు వాయిదావేసుకుంటున్నారు. ఈ కారణంగా రిజిస్ర్టేషన్లు తగ్గిపోవడంతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ప్రభుత్వం విధించిన ఆదాయ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి.

రిజిస్ర్టేషన్లపై మౌఢ్యమి ప్రభావం
నక్కపల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సగానికి తగ్గిన ఆదాయం

ఫిబ్రవరి రెండో వారం వరకు ఇదే పరిస్థితి

నక్కపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మౌఢ్యమి కారణంగా గత 40 రోజుల నుంచి భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ర్టేషన్లు బాగా తగ్గిపోయాయి. నవంబరు 29వ తేదీ నుంచి మౌఢ్యమి ప్రారంభం కావడంతో ముఖ్యమైన రిజిస్ర్టేషన్లను క్రయవిక్రయదారులు వాయిదావేసుకుంటున్నారు. ఈ కారణంగా రిజిస్ర్టేషన్లు తగ్గిపోవడంతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ప్రభుత్వం విధించిన ఆదాయ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. ఫిబ్రవరి రెండో పక్షం వరకు మౌఢ్యమి వుండడంతో అప్పటి వరకు రిజిస్ర్టేషన్లు పెద్దగా జరగవని చెబుతున్నారు. నక్కపల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రోజుకు 39 రిజిస్ర్టేషన్లు చేయడానికి వెసులబాటువుంది. కానీ డి సెంబరు నుంచి రోజుకు 20 రిజిస్ట్రేషన్లు కాడా కావడంలేదని సబ్‌రిజిస్ర్టార్‌ సీహెచ్‌ న రసింహమూర్తి చెప్పారు. డిసెంబరు నెలకు కేటాయించిన స్లాట్‌లో 52 శాతం రిజిస్ర్టేషన్లు మాత్రమే అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇవి కూడా ఆస్తి తనఖాలు, రుణదస్తావేజులు వుంటున్నాయన్నారు. ఫిబ్రవరి 17 తరువాత రిజిస్ర్టేషన్లు ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 10 , 2026 | 01:21 AM