కళ తప్పిన ఐస్‌గెడ్డ జలపాతం
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:28 AM
జీకేవీధి మండలం సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం నీరు లేక కళ తప్పింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆగస్టు వచ్చినా ఈ ప్రాంతంలో సరైన భారీ వర్షాలు కురవకపోవడంతో సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం వెలవెలబోతోంది.
వర్షాలు లేక వెలవెల
సీలేరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం నీరు లేక కళ తప్పింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆగస్టు వచ్చినా ఈ ప్రాంతంలో సరైన భారీ వర్షాలు కురవకపోవడంతో సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం వెలవెలబోతోంది. వాస్తవానికి ఏటా ఈ జలపాతం జూన్, జూలై నెలల్లో కురిసే వర్షాలకు కళకళలాడుతూ పర్యాటకులకు కనువిందు చేసేది. సీలేరు- ధారకొండ ప్రధాన మార్గంలో సీలేరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే ప్రయాణికులు, ధారాలమ్మ ఆలయానికి వచ్చే భక్తులను ఆకర్షిస్తుంది. అటువంటి సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం ప్రస్తుతం వర్షాలు లేక కళ తప్పి ప్రకృతి ప్రేమికులను నిరాశ పరుస్తోంది.