వారపు సంతలో బుడియాల సందడి
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:31 PM
ముంచంగిపట్టులో శనివారం జరిగిన వారపు సంతలో బుడియాలు సందడి చేశారు.
ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ముంచంగిపట్టులో శనివారం జరిగిన వారపు సంతలో బుడియాలు సందడి చేశారు. మండలంలోని సుజనకోటలో ఈనెల 16, 17 తేదీలలో జరగనున్న గంగమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా కొందమంది భక్తులు బుడియా వేషధారణ ధరించారు. వారం రోజుల పాటు వారు బుడియా వేషధారణతో ఉంటారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్‌ఐ పి.నానిలు కొబ్బరికాయలు కొట్టిన అనంతరం ఉత్సవ నిర్వాహకులు, బుడియాలు సంతలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవాలపై విస్తృత ప్రచారం చేపట్టారు. బుడియాల నృత్య ప్రదర్శన, వివిధ రకాల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. అలాగే సోమ, మంగళవారాల్లో జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.