Share News

గృహ గణన గడువులోగా పూర్తిచేయాలి

ABN , Publish Date - May 21 , 2026 | 01:05 AM

జిల్లాలో జరుగుతున్న గృహ గణన సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. జనాభా గణన విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ దయాసాగర్‌, జిల్లా ఇన్‌చార్జి జోషిణి బుధవారం ఉదయం కలెక్టర్‌ను ఆమె చాంబర్‌లో కలిశారు. గృహ గణన ఇంతవరకు 80 శాతం పూర్తయ్యిందని, ఈ నెల 30వ తేదీనాటికి శతశాతం గృహ గణన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ వారిని ఆదేశించారు. 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తాళాలు వేసి వున్న ఇళ్లు, ఖాళీగా ఉన్న ఇళ్లకు సంబంధించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని జాయింట్‌ డైరెక్టర్‌ దయాసాగర్‌ వివరించారు.

గృహ గణన గడువులోగా పూర్తిచేయాలి
కలెక్టర్‌ విజయకృష్ణన్‌ను కలిసిన జనాభా గణన అధికారులు

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న గృహ గణన సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. జనాభా గణన విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ దయాసాగర్‌, జిల్లా ఇన్‌చార్జి జోషిణి బుధవారం ఉదయం కలెక్టర్‌ను ఆమె చాంబర్‌లో కలిశారు. గృహ గణన ఇంతవరకు 80 శాతం పూర్తయ్యిందని, ఈ నెల 30వ తేదీనాటికి శతశాతం గృహ గణన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ వారిని ఆదేశించారు. 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తాళాలు వేసి వున్న ఇళ్లు, ఖాళీగా ఉన్న ఇళ్లకు సంబంధించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని జాయింట్‌ డైరెక్టర్‌ దయాసాగర్‌ వివరించారు.

Updated Date - May 21 , 2026 | 01:05 AM