Share News

చెత్త రహిత గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:42 AM

గ్రామాలను చెత్త రహితంగా తీర్చి దిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

చెత్త రహిత గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం అర్బన్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

గ్రామాలను చెత్త రహితంగా తీర్చి దిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం మండలానికి కేటాయించిన స్వచ్ఛరథాన్ని ఆయన సోమవారం ఇక్కడ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, ప్లాస్టిక్‌, ఇనుము, పేపర్లు, ఇతర పొడి వ్యర్థాలను ప్రజలు ఎక్కడపడితే అక్కడ పారేయవద్దని సూచించారు. వీటిని ఇళ్లల్లో భద్రపరిచి, స్వచ్ఛరథం వచ్చినప్పుడు అందజేయాలని, వీటి విలువకు సరిపడ వివిధ రకాల నిత్యావసర సరుకులు పొందువచ్చని చెప్పారు. ప్రజలంతా స్వచ్ఛ రథం సేవలను వినియోగించుకొని, గ్రామాలను పరిశుభ్రంగా వుంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 01:42 AM