Share News

దారి చూపిన దేవుళ్లు

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:41 PM

‘షాడ- గొందివలస రహదారి ఎన్నో ఏళ్లగా అధ్వానంగా ఉంది. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ప్రజాప్రతి నిధులు, అధికారులకు విన్నవించుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించి నాలుగు నెలల వ్యవధిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసింది. ఎన్నో ఏళ్లనాటి మా కలను నెరవేర్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రుణపడి ఉంటాం’ అని షాడ, గొందివలస గ్రామస్థులు తెలిపారు.

దారి చూపిన దేవుళ్లు
షాడ- గొందివలస రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత ఇలా..

షాడ- గొందివలస రోడ్డు నిర్మాణం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రుణపడి ఉంటాం

ఆయా గ్రామస్థుల ఆనందం

అనంతగిరి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘షాడ- గొందివలస రహదారి ఎన్నో ఏళ్లగా అధ్వానంగా ఉంది. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ప్రజాప్రతి నిధులు, అధికారులకు విన్నవించుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించి నాలుగు నెలల వ్యవధిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసింది. ఎన్నో ఏళ్లనాటి మా కలను నెరవేర్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రుణపడి ఉంటాం’ అని షాడ, గొందివలస గ్రామస్థులు తెలిపారు.

కొండిబ పంచాయతీకి చెందిన షాడ, గొందివలస గ్రామాల్లో 300కు పైబడి గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆయా గ్రామాలకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతుండేవారు. గ్రామాల నుంచి సింగర్భ రోడ్డుకు వచ్చేంత వరకు ప్రయాణానికి నరకం అనుభవించేవారు. ఈ మార్గంలో వాహనదారులు ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వారిలో ఆశలు చిగురించాయి. ఆ గ్రామాల ప్రజల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం సింగర్భ రోడ్డు నుంచి షాడ మీదుగా గొందివలస వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.1.89 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబరు నెలలో పనులు ప్రారంభించగా, ఇటీవల పూర్తయి ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ రెండు గ్రామాలతో పాటు డుంబ్రివలస, కోసమామిడి, కపాటివలస గ్రామాలకు కూడా రవాణా కష్టాలు తీరాయి. ఎన్నో ఏళ్లుగా తాము ఇబ్బంది పడుతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్య పరిష్కారమైందని షాడ గ్రామానికి చెందిన పి.జగన్‌బాబు తెలిపారు.

Updated Date - Jan 08 , 2026 | 11:41 PM