Share News

సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:12 PM

జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా అధికారులు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.

సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యం

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ

వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలి

వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలి

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా అధికారులు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శనివారం ఆమె ఐటీడీఏ కార్యాలయం నుంచి అధికారులతో వర్చువల్‌లో మాట్లాడారు. ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. మొదటి వారంలో ఆరు రోజులు పనులు ఎంపిక చేయడం, ఉపాధి హామీ పథకంలో నిధులు సర్ధుబాటు, పనులు ఎక్కడ చేపట్టాలో నిర్ణయించడం, తదుపరి ఐదు రోజుల్లో పనులకు అనుమతులు మంజూరు చేయడం. 80 రోజుల్లో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్ధ ఆధ్వర్యంలో జలవనరులు శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థక శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యాసాగర్‌రావు, వివిధ శాఖల అధికారులు రాజేశ్వరరావు, ఎస్‌బీఎస్‌.నందు, బాలకర్ణ, శ్రీనివాసరావు, జయరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:12 PM