Share News

మరింత ప్రగతే లక్ష్యం

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:28 AM

నూతన సంవత్సరంలో అందిరి సహకారంతో జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం జిల్లా ప్రగతిపై మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకున్నామని వివరించారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద ప్రతి నెల సుమారు రెండున్నర లక్షల మందికి నగదు సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 2025లో కొత్తగా 7,419 మందికి పెన్షన్‌లు మంజురు చేశామన్నారు.

మరింత ప్రగతే లక్ష్యం
సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో కలసి కేక్‌ కట్‌చేస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

అనకాపల్లి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో అందిరి సహకారంతో జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం జిల్లా ప్రగతిపై మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకున్నామని వివరించారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద ప్రతి నెల సుమారు రెండున్నర లక్షల మందికి నగదు సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 2025లో కొత్తగా 7,419 మందికి పెన్షన్‌లు మంజురు చేశామన్నారు. ఎస్‌హెచ్‌జీకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా రూ.1,300 కోట్లు అందించామన్నారు. జిల్లాలో రూ.47,961 కోట్లతో 134 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 75,797 మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రూ.2,89,161 కోట్లతో ఏర్పాటు చేయనున్న 46 పరిశ్రమల్లో సుమారు 1,56,000 మందికి ఉద్యోగ/ ఉపాధి కలుగుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి మాకవరపాలెం, కోడూరు, పరవాడ, అచ్యుతాపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు ఇండస్ర్టీయల్‌ పార్కు నక్కపల్లిలో 93 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్నట్టు పేర్కొన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ఏఎల్‌ఈఏపీకి 31.77 ఎకరాలు కేటాయించామన్నారు. క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద కొబ్బరి పీచు విలువ ఆధారిత ఉత్పత్తులు, జీడిపప్పు ప్రాసెసింగ్‌, పాల ఉత్పత్తులు, మాడుగుల హల్వా, ఏటి కొప్పాక బొమ్మలు వంటి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 02 , 2026 | 12:28 AM