Share News

టెన్త్‌లో శత శాతం ఫలితాలే లక్ష్యం

ABN , Publish Date - May 12 , 2026 | 11:32 PM

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శత శాతం ఫలితాలే లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల విద్యా శాఖాధికారుల (ఎంఈవోలు)తో మంగళవారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

టెన్త్‌లో శత శాతం ఫలితాలే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శత శాతం ఫలితాలే లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల విద్యా శాఖాధికారుల (ఎంఈవోలు)తో మంగళవారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ మండలానికి సంబంధించిన పాస్‌, ఫెయిల్‌ శాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫలితాల్లో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అలాగే ఉత్తీర్ణులుకాని విద్యార్థి, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో కూడా సమన్వయం చేసుకొని విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యేకంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని ఎంఈవోలకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి అప్పారావునాయుడు, ఎంఈవోలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:32 PM