స్నేహపూర్వక పర్యాటకమే లక్ష్యం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:25 PM
పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే వారితో స్నేహ పూర్వకంగా ఉండడమే లక్ష్యమని జిల్లా పర్యాటక శాఖాధికారి పి.చలపతిరావు అన్నారు.
జిల్లా పర్యాటక శాఖాధికారి చలపతిరావు
పాడేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే వారితో స్నేహ పూర్వకంగా ఉండడమే లక్ష్యమని జిల్లా పర్యాటక శాఖాధికారి పి.చలపతిరావు అన్నారు. మండలంలో వంజంగి హిల్స్ ప్రాంతాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లాకు వస్తున్న పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. అలాగే హోటళ్లు, లాడ్జీలు, రిస్టార్లు, వాహనాల యజమానులు సైతం ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో సందర్శకులకు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారిస్తున్నామన్నారు. పర్యాటకులు సైతం సందర్శనీయ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ను వినియోగించకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జిల్లా పర్యాటక శాఖాధికారి పి.చలపతిరావు కోరారు.