నిప్పుల కొలిమి..
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:12 AM
జిల్లా మొత్తం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీక్షణంగా కాసింది. దీనికితోడు తీవ్ర వడగాడ్పులు వీచాయి. జిల్లాలో 24 మండలాలకుగాను గొలుగొండ, అచ్యుతాపురం మినహా మిగిలిన 22 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రహదారులపై జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది.
ఠారెత్తించిన ఎండ, వడగాడ్పులు
22 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
వడదెబ్బకు కొత్తకోటలో వృద్ధుడి మృతి
అనకాపల్లి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా మొత్తం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీక్షణంగా కాసింది. దీనికితోడు తీవ్ర వడగాడ్పులు వీచాయి. జిల్లాలో 24 మండలాలకుగాను గొలుగొండ, అచ్యుతాపురం మినహా మిగిలిన 22 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రహదారులపై జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది. బుచ్చెయ్యపేట మండలంలో అ్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నక్కపల్లి, నాతవరం, నర్సీపట్నం, అనకాపల్లి, ఎలమంచిలిలో కూడా ఇంచుమించు 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. నక్కపల్లిలో 42.5, నాతవరంలో 42.4, నర్సీపట్నంలో 42.3, అనకాపల్లిలో 42, ఎలమంచిలిలో 42, చోడవరంలో 41.8, పరవాడలో 41.8, సబ్బవరంలో 41.8, దేవరాపల్లిలో 41.7, కశింకోటలో 41.7, కె.కోటపాడులో 41.6, రావికమతంలో 41.6, రోలుగుంటలో 41.6, మాడుగులలో 41.5, మునగపాకలో 41.4, చీడికాడలో 41.2, కోటవురట్లలో 41.2, మాకవరపాలెంలో 41.2, ఎస్.రాయవరంలో 41.1 పాయకరావుపేటలో 40.7, రాంబిల్లిలో 40.4, గొలుగొండలో 39.4, అచ్యుతాపురంలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బకు వృద్ధుడి మృతి
రావికమతం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తకోటలో వడదెబ్బకు గురై వృద్ధుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి అప్పారావు (77) వ్యవసాయదారుడు. ప్రస్తుతం పొలం పనులు లేకపోవడంతో ఇంటివద్దనే వుంటున్నాడు. వృద్ధాప్యానికి తోడు నాలుగైదు రోజుల నుంచి ఎండ తీవ్రంగా కాస్తుండడంతో వడదెబ్బకు గురై నీరసించిపోయాడు. కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీని రప్పించి వైద్య సేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి మృతిచెందాడని తెలిపారు.