పొగమంచు తగ్గదే..!
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:38 AM
వాతావరణంలో మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా ఉదయం 9 గంటల వరకు వీడని మంచు తెరలు
పాడేరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆదివారం జిల్లా కేంద్రం పాడేరు మొదలుకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. ఉదయం వేళల్లో పొగమంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి వేళ చలి ప్రభావం చూపుతున్నాయి. ఆదివారం అరకులోయలో 18.0, పెదబయలులో 17.2, చింతపల్లిలో 17.3, జి.మాడుగులలో 18.4, కొయ్యూరులో 19.0, అనంతగిరిలో 20.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.