Share News

ఉత్సవ్‌కు పోటెత్తిన జనం

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:22 AM

‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే...ఫట్‌మని పేలిందా నా గుండు కల్లాసే’, ‘ఊరెళ్లిపోతా మామా...ఊరెళ్లిపోతా...’ అంటూ గాయకుడు రామ్‌ మిరియాల పాడిన పాటలకు ప్రేక్షకుల కేరింతలతో ఆర్‌కే బీచ్‌ శుక్రవారం సాయంత్రం హోరెత్తిపోయింది.

ఉత్సవ్‌కు పోటెత్తిన జనం

ఆర్కే బీచ్‌లో ఉర్రూతలూగించిన గాయకుడు రామ్‌ మిరియాల

ఏయూలో ముగ్గులు, ‘సన్‌’లో వంటల పోటీలు

నేడు ముగింపు కార్యక్రమం

విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):

‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే...ఫట్‌మని పేలిందా నా గుండు కల్లాసే’, ‘ఊరెళ్లిపోతా మామా...ఊరెళ్లిపోతా...’ అంటూ గాయకుడు రామ్‌ మిరియాల పాడిన పాటలకు ప్రేక్షకుల కేరింతలతో ఆర్‌కే బీచ్‌ శుక్రవారం సాయంత్రం హోరెత్తిపోయింది. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి యువత భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకూ జరిగిన వాటిల్లో రామ్‌ మిరియాల సంగీత విభావరే హైలైట్‌గా నిలిచింది. ఇక, ఉత్సవ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం ఏయూ మైదానంలో ముగ్గుల పోటీలను విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. సాగర్‌నగర్‌లోని సన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో వంటల పోటీలు నిర్వహించారు. ఎండాడ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైజాగ్‌ క్రౌన్‌ ముగింపు పోటీలు పెట్టారు. మరోవైపు సిటీ సెంట్రల్‌ పార్కులో వీఎంఆర్‌డీఏ ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ సెల్ఫీ పాయింట్లలో ఫొటోలు తీసుకోవడానికి పది నిమిషాల కంటే ఎక్కువ సమయం వేచి ఉంటున్నారు. గత నాలుగు రోజుల్లో నిర్వహించిన వైజాగ్‌ క్రౌన్‌, బీచ్‌ కబడ్డీ, బీచ్‌ వాలీబాల్‌, బీచ్‌ ఫుట్‌బాల్‌, బోటింగ్‌, వంటలు, ముగ్గుల పోటీల విజేతలకు ఆర్‌కే బీచ్‌లో ప్రధాన వేదికపై శనివారం జరిగే ముగింపు వేడుకలో బహుమతులు అందించనున్నారు.

Updated Date - Jan 31 , 2026 | 01:22 AM