గెడ్డల ఉగ్రరూపం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:47 AM
మండల పరిధిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం కాస్త తెరిపి ఇచ్చి సాయంత్రం మళ్లీ భారీ వర్షం పడింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, రంగబయలు, బూసిపుట్టు, దొడిపుట్టు, బంగారుమెట్ట, జోలాపుట్టు, సుజనకోట, తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల గెడ్డలు వరద నీటితో ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి.
ముంచంగిపుట్టు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం కాస్త తెరిపి ఇచ్చి సాయంత్రం మళ్లీ భారీ వర్షం పడింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, రంగబయలు, బూసిపుట్టు, దొడిపుట్టు, బంగారుమెట్ట, జోలాపుట్టు, సుజనకోట, తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల గెడ్డలు వరద నీటితో ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న పలు గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లక్ష్మీపురం పంచాయతీ కర్లాపొదర్, ఉబ్బెంగుల, దొరగూడ, దోడిపుట్టు పంచాయతీ బీడిచెంప గ్రామాల సమీపంలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి.
ముసురు తగ్గుముఖం
పాడేరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో మంగళవారం మధ్యాహ్నానికి ముసురు కాస్త తగ్గింది. కొయ్యూరులో 30.3, పాడేరులో 27.5, అరకులోయలో 27.2, జి.మాడుగులలో 26.5, చింతపల్లిలో 25.7, హుకుంపేటలో 24.2, పెదబయలులో 23.4, ముంచంగిపుట్టులో 23.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.