ఉత్సవ్‌లో పెరిగిన జోష్
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:25 AM
విశాఖ ఉత్సవ్‌లో మంగళవారం కాస్త జోష్ పెరిగింది. కార్యక్రమాలు ఉత్సాహభరితంగా లేవని ప్రచారం జరగడంతో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాయకుడు జావెద్ అలీ పాడిన పాటలు సందర్శకులను వేదిక వైపు రప్పించాయి. అంతకు ముందు దిల్లుభాయి బ్రదర్స్ ప్రదర్శించిన నృత్యాలు యువతను ఉత్సాహపరిచాయి.
ఆకట్టుకున్న జావెద్ అలీ పాటలు
విశాఖపట్నం/బీచ్ రోడ్డు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌లో మంగళవారం కాస్త జోష్ పెరిగింది. కార్యక్రమాలు ఉత్సాహభరితంగా లేవని ప్రచారం జరగడంతో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాయకుడు జావెద్ అలీ పాడిన పాటలు సందర్శకులను వేదిక వైపు రప్పించాయి. అంతకు ముందు దిల్లుభాయి బ్రదర్స్ ప్రదర్శించిన నృత్యాలు యువతను ఉత్సాహపరిచాయి. టిక్ టాక్ గేమ్ రవి పిల్లలతో చేసిన ప్రదర్శన నవ్వులు పూయించింది. ఉత్సవ్‌కు ప్రజా ప్రతినిధులు కూడా రావడం లేదని వార్తలు రావడంతో మంగళవారం ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ హాజరయ్యారు. పర్యాటకుల కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, విశాఖ ప్రజలు వీటిని విజయువంతం చేయాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. ఉత్సవాలపై మెల్లగా ప్రచారం ఊపందుకోవడంతో ఏమి జరుగుతున్నదో చూడాలని వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఫుడ్ స్టాళ్లు యథా ప్రకారం కిటకిటలాడాయి. వాహనాలతో బీచ్‌రోడ్డులోకి రావడానికి అనుమతించడంతో మంగళవారం సందర్శకుల సంఖ్య పెరిగింది.