Share News

అలరించిన మల్లిక్‌, గోపికల స్వరాభిషేకం

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:49 AM

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమంలో సినీ గాయకులు మల్లికార్జున్‌, గోపిక పూర్ణిమ ఆలపించిన పలు గేయాలు ఆహూతులను అలరింపజేశాయి.

అలరించిన మల్లిక్‌, గోపికల స్వరాభిషేకం
గేయాలు ఆలపిస్తున్న మల్లికార్జున్‌, గోపిక పూర్ణిమ

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమంలో సినీ గాయకులు మల్లికార్జున్‌, గోపిక పూర్ణిమ ఆలపించిన పలు గేయాలు ఆహూతులను అలరింపజేశాయి. ప్రతి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా మూడో ఆదివారం అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ఉదయం ఆరు గంటల నుంచే భక్తుల రాక మొదలైంది. సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. కాగా పదవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి నరేశ్‌ దంపతులు నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 12:49 AM