Share News

రాష్ట్రపతిని కలిసిన ఈఎన్‌సీ చీఫ్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:06 AM

తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా తన సతీమణి ప్రియా భల్లాతో కలిసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు.

రాష్ట్రపతిని కలిసిన ఈఎన్‌సీ చీఫ్‌

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా తన సతీమణి ప్రియా భల్లాతో కలిసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. భారత రక్షణ దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్రపతికి తీర ప్రాంత రక్షణలో ప్రస్తుత పరిస్థితులు, తూర్పు నౌకాదళం సన్నద్ధతతో పాటు వచ్చే నెల ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ-2026, మిలాన్‌-2026, ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం తదితర అంశాలను వివరించారు. భార్యతో కలిసి జ్ఞాపికను బహూకరించారు.

Updated Date - Jan 07 , 2026 | 01:06 AM