Share News

2040 నాటికి వికసిత్‌ భారత్‌ కల సాకారం

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:28 AM

స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి వాటి ద్వారా లభించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు.

2040 నాటికి వికసిత్‌ భారత్‌ కల సాకారం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

ఆత్మనిర్బర్‌ భారత్‌ ద్వారా లభించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపు

బీచ్‌రోడ్డులో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

బీచ్‌రోడ్డు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):

స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి వాటి ద్వారా లభించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్కే బీచ్‌రోడ్డులో ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాధవ్‌ మాట్లాడుతూ 2040 సంవత్సరంకల్లా వికసిత్‌ భారత్‌ కల సాకారం అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు, ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో స్వావలంబన దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్‌ 6న అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌.కె.అద్వానీ సారథ్యంలో ఆవిర్భవించిందని, నేడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్‌.పరశురామరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 01:28 AM