క్రికెటర్లు వచ్చేశారు
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:30 AM
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనున్న భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
విశాఖ చేరుకున్న భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు
టీ20 మ్యాచ్ రేపు
విశాఖపట్నం-స్పోర్ట్స్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనున్న భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో రాడిసన్ హోటల్‌కు చేరుకుని, బస చేశారు. నగరానికి చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర పటేల్, శ్రేయాస్ అయ్యర్, రింకుసింగ్, శివం దుబే, ఇషాన్ కిషన్, అభిషేక్‌శర్మ, హార్ధిక్ పాండ్యా, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, హర్షిత్ రాణా, అక్షరదీప్‌సింగ్, రవి బిష్ణోయి, బుమ్రాతోపాటు కోచ్ గౌతమ్ గంభీర్, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ శాంతర్, టిమ్ రాబిన్‌సన్, జాకబ్స్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మైకేల్ బ్రేస్‌వెల్, జాక్ ఫౌల్కెస్, మార్క్ చాంపన్, జేమ్స్ నీషమ్, టిమ్ షీఫెర్ట్, ఆడమ్ మిల్నే, జాకబ్ దుఫీ, డారీ మిశ్చెల్, ఫిన్ అలెన్, దివోన్ కన్వే, లోకీ, క్రిస్టియన్ క్లార్క్, జామిసన్ ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇరుజట్ల ఆటగాళ్లు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు.