Share News

లంబసింగిలో సందడి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:19 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో లంబసింగి జంక్షన్‌, చెరువులవేనం, తాజంగి జలాశయం, భీమనపల్లి ప్రాంతాలకు చేరుకున్నారు.

లంబసింగిలో సందడి
చెరువులవేనంలో పర్యాటకులు

చింతపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో లంబసింగి జంక్షన్‌, చెరువులవేనం, తాజంగి జలాశయం, భీమనపల్లి ప్రాంతాలకు చేరుకున్నారు. చెరువులవేనంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేశారు. తొమ్మిది గంటలకు ఎండ తీవ్రత పెరగడంతో పర్యాటకులు వెనుదిరిగారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్‌, బోటింగ్‌ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. స్ట్రాబెర్రీ తోటల్లో పర్యాటకులు సందడి చేశారు. యర్రవరం జలపాతానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

Updated Date - Feb 22 , 2026 | 11:19 PM