Share News

కలిసొచ్చిన వర్షాలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:21 AM

గిరిజన ప్రాంతంలో మార్చి నెలలో కురిసిన వర్షాలు కాఫీ పూతకు అనుకూలించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతలో సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో వర్షాలు కురుస్తాయి. కాఫీ పంటకు ఈ వర్షాలు అత్యంత కీలకం.

కలిసొచ్చిన వర్షాలు
యర్రవరంలో మల్లెమాలను పోలినట్టు విరబూసిన కాఫీ పూత

మార్చి నెలలో కురిసిన వర్షాలకు విరబూసిన కాఫీ పూత

చింతపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మార్చి నెలలో కురిసిన వర్షాలు కాఫీ పూతకు అనుకూలించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతలో సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో వర్షాలు కురుస్తాయి. కాఫీ పంటకు ఈ వర్షాలు అత్యంత కీలకం. మార్చిలో కురిసిన వర్షాలు కాఫీ దిగుబడులపై ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం 4.7 మిల్లీ మీటర్లు కాగా 48.6, మార్చిలో సాధారణ వర్షపాతం 30.3 మిల్లీమీటర్లు కాగా 70.4 వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటేరెండు నెలల్లో 50 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మార్చిలో కురిసిన వర్షాలకు ప్రస్తుతం కాఫీ తోటల్లో విస్తారంగా పూత వచ్చింది. ఏప్రిల్‌లో కురిసే వర్షాలు పూత దశ నుంచి పిందె దశకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాఫీ దిగుబడులు పెరగాలంటే గిరిజన రైతులు తోటల్లో వేసవి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్‌ వి.రమణ తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 12:21 AM