Share News

నూకాంబికను దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:07 AM

స్థానిక నూకాంబిక అమ్మవారిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్‌, దినేశ్‌కుమార్‌ దంపతులు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ దర్శించుకున్నారు.

నూకాంబికను దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకువస్తున్న కలెక్టర్‌ దంపతులు విజయకృష్ణన్‌, దినేశ్‌కుమార్‌. చిత్రంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఉన్నారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విజయకృష్ణన్‌, దినేశ్‌కుమార్‌

అనకాపల్లి టౌన్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్‌, దినేశ్‌కుమార్‌ దంపతులు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ దర్శించుకున్నారు. కలెక్టర్‌ దంపతులు పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ సుజాత, అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధారాణి, ఆలయ ఈవో వై.శ్రీధర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఆర్డీవో షేక్‌ ఆయీషా, ఆలయ ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:07 AM