Share News

బాలుడిని బలిగొన్న కారు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:37 PM

చింతపల్లి- కృష్ణాదేవిపేట జాతీయ రహదారి రింతాడ గ్రామం వద్ద ఆదివారం ఒక కారు అదుపుతప్పి వేగంగా ఇంటి వైపు దూసుకొచ్చింది. అరుగుపై ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

బాలుడిని బలిగొన్న కారు
ప్రమాదానికి కారణమైన కారు

అదుపుతప్పి ఇంటి వైపు దూసుకొచ్చి ఢీకొనడంతో మృతి

గూడెంకొత్తవీధి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

చింతపల్లి- కృష్ణాదేవిపేట జాతీయ రహదారి రింతాడ గ్రామం వద్ద ఆదివారం ఒక కారు అదుపుతప్పి వేగంగా ఇంటి వైపు దూసుకొచ్చింది. అరుగుపై ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పెదవలసకు చెందిన ఏపీఈపీడీసీఎల్‌ ఉద్యోగి ప్రసాద్‌ బంధువుల వివాహం విందుకు హాజరై స్వగ్రామానికి వస్తున్నాడు. నిద్రమత్తు వల్ల రెప్పపాటు వ్యవధిలో కారు అదుపుతప్పి రహదారిపై నుంచి దిగువనున్న ఇంటి వైపు దూసుకొచ్చింది. ఆ ఇంటి అరుగుపై ఆడుకుంటున్న వంతల లోకేశ్‌(3)ను ఢీకొనడంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే ఆ బాలుడిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీకేవీధి ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Mar 22 , 2026 | 11:37 PM