Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:42 AM

మండలంలోని రేవుపోలవరం సముద్ర తీరానికి పర్యాటకుల తాకిడి నెలకొంది. కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో ఆహ్లాదకరమైన ఈ సముద్ర తీరానికి పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర తీరంలో సరదాగా గడిపారు. ఆట పాటలతో సందడి చేశారు.

పర్యాటకుల సందడి
రేవుపోలవరం సముద్ర తీరం వద్ద పర్యాటకులు పర్యాటకుల సందడి

- రేవుపోలవరం సముద్ర తీరం వద్ద కోలాహలం

ఎస్‌.రాయవరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రేవుపోలవరం సముద్ర తీరానికి పర్యాటకుల తాకిడి నెలకొంది. కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో ఆహ్లాదకరమైన ఈ సముద్ర తీరానికి పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర తీరంలో సరదాగా గడిపారు. ఆట పాటలతో సందడి చేశారు. మఽద్యాహ్నం నుంచి చుట్టుపక్కల ఉన్న తోటల్లో వన భోజనాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. సముద్ర తీరం వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గాను స్థానిక పోలీసులతో పాటు మెరైన్‌ పోలీసులు గస్తీ నిర్వహించారు.

Updated Date - Nov 23 , 2026 | 12:42 AM