Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:11 AM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో పర్యాటకుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం ఏజెన్సీలో ప్రకృతి అందాలు సుందరంగా ఉండడంతో జనం మన్యం బాటపడుతున్నారు. దీంతో ఆదివారం మన్యంలో సందర్శకుల సందడి కనిపించింది.

పర్యాటకుల సందడి
చెరువులవేనంలో పర్యాటకులు

- సందర్శనీయ ప్రాంతాలు కిటకిట

పాడేరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో పర్యాటకుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం ఏజెన్సీలో ప్రకృతి అందాలు సుందరంగా ఉండడంతో జనం మన్యం బాటపడుతున్నారు. దీంతో ఆదివారం మన్యంలో సందర్శకుల సందడి కనిపించింది.

అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి కొనసాగుతున్నది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, యర్రవరం జలపాతం, తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.

లంబసింగిలో...

చింతపల్లి: ఆంరఽధ కశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటలకే లంబసింగి జంక్షన్‌కి సందర్శకులు చేరుకున్నారు. తుఫాన్‌ వల్ల చెరువులవేనం వ్యూపాయింట్‌కి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వెళ్లలేదు. కొంత మంది పర్యాటకులు కాలినడకన అవస్థలు పడుతూ వ్యూపాయింట్‌ వద్ధకు చేరుకుని మంచు అందాలను తిలకించారు. తాజంగి జలాశయంలోని సాహస క్రీడలు జిప్‌లైన్‌, బోటింగ్‌ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. స్ట్రాబెరీ తోటలను సందర్శించారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు రద్దీగా కనిపించారు. యర్రవరం జలపాతాన్ని అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.

Updated Date - Nov 02 , 2026 | 01:11 AM