కనువిందుజేస్తున్న కటిక జలపాతం
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:50 PM
అర్నబ్ తుఫాన్‌తో ఏకధాటిగా కురిసిన వర్షంతో కటిక జలపాతం కనువిందుజేస్తున్నది.
అరకులోయ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్‌తో ఏకధాటిగా కురిసిన వర్షంతో కటిక జలపాతం కనువిందుజేస్తున్నది. రక్తకొండ పై నుంచి 300 మీటర్ల ఎత్తు నుంచి జారి పడుతున్న జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం జలపాతం సమీపానికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు రోజుల్లో జలపాతం ఉధృతి తగ్గే అవకాశాలు ఉన్నాయి.