పెదపాడుకు మహర్దశ
ABN , Publish Date - May 12 , 2026 | 12:33 AM
ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని మండలంలోని పోతంగి పంచాయతీలో గల పెదపాడు గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చాక మహర్దశ పట్టింది. గ్రామంలో పాఠశాల భవనంతో పాటు అన్ని వీధుల్లో రోడ్లు నిర్మించడంతో ఆ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం చొరవతో రహదారులు, పాఠశాల భవనం నిర్మాణం
కూటమి ప్రభుత్వం వచ్చాక మారిన గ్రామం రూపురేఖలు
డుంబ్రిగుడ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని మండలంలోని పోతంగి పంచాయతీలో గల పెదపాడు గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చాక మహర్దశ పట్టింది. గ్రామంలో పాఠశాల భవనంతో పాటు అన్ని వీధుల్లో రోడ్లు నిర్మించడంతో ఆ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెదపాడు గ్రామాన్ని గత ఏడాది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు. రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకుని అరకు- పాడేరు ప్రధాన రహదారి నుంచి గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల భవనం నిర్మించాలని సూచించారు. దీంతో అధికారులు ప్రధాన రహదారితో పాటు గ్రామంలో మిగతా రోడ్లను కూడా నిర్మించారు. కొత్తగా పాఠశాల భవనాన్ని నిర్మించారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలుపు తున్నారు.