Share News

జలపాతం అందాలు కనువిందు

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:24 PM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీ సమీపంలో గల ఉంచాయిపడా గ్రామంలోని జలపాతం కనువిందు చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎత్తైన బండరాళ్లపై నుంచి పాలధారలా ప్రవహిస్తున్న ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది.

జలపాతం అందాలు కనువిందు
ఉరకలేస్తూ ప్రవహిస్తున్న జలపాతం

ముంచంగిపుట్టు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీ సమీపంలో గల ఉంచాయిపడా గ్రామంలోని జలపాతం కనువిందు చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎత్తైన బండరాళ్లపై నుంచి పాలధారలా ప్రవహిస్తున్న ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. అక్కడికి వెళ్లాలంటే ఒనకఢిల్లీ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ఉంచాయిపడా వరకు వాహనంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అర కిలోమీటరు కాలినడకన వెళితే జలపాతానికి చేరుకోవచ్చు.

Updated Date - Aug 30 , 2026 | 11:24 PM