నేడు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్ల రాక
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:46 AM
పీఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28న జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సోమవారం నగరానికి చేరుకోనున్నారు.
విశాఖపట్నం, స్పోర్ట్స్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):
పీఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28న జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సోమవారం నగరానికి చేరుకోనున్నారు. గువహటి నుంచి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్ రాడిసన్‌కు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇరుజట్ల ఆటగాళ్లు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీసు చేస్తారు.