జిల్లా అభివృద్ధే కూటమి ధ్యేయం
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:50 AM
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని రావలమ్మపాలెంలో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీతో కలసి రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ, దేశంలో కనీవినీ ఎరగని రీతిలో అనకాపల్లి జిల్లాకు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు
యువతకు ఉద్యోగ, ఉపాధికి అధిక ప్రాధాన్యం
ఎంపీ సీఎం రమేశ్
పల్లె పండుగ 3.0లో రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
సబ్బవరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని రావలమ్మపాలెంలో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీతో కలసి రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ, దేశంలో కనీవినీ ఎరగని రీతిలో అనకాపల్లి జిల్లాకు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, దీంతో గత ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అండతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు వ్యవసాయ రంగం పురోగతికి సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో పదేళ్ల వరకు కూటమిని విడదీయలేరన్నారు. కూటమి ప్రభుత్వం అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తున్నదని, అందువల్ల స్థానికు సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి కూటమి అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆరిపాకలో రూ.47 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకటరావు, కూటమి నేతలు సురేంద్ర మోహన్, ఈర్లె శ్రీరామమూర్తి, గండి వంశీదీప్, మిడతాడ మహాలక్ష్మినాయుడు, రొంగలి దేముడు, శ్రీరాములమ్మ, బీఏ రావు, ఇందలి రమణ, గండి ముత్యాలనాయుడు, శరగడం శంకరరావు, వేగి పరమేశ్వరరావు, శరగడం సురేశ్, చొక్కాకుల లక్ష్మి, చొక్కాకుల గోవింద, అనిల్, తదితరులు పాల్గొన్నారు.