రైతు సంక్షేమమే కూటమి ధ్యేయం
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:55 PM
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతున్నదని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు.
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
జిల్లాలో 1,03,864 మంది రైతులకు
రూ.62.32 కోట్లు జమ
పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతున్నదని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద పెట్టుబడి నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని స్థానిక కాఫీ హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ సర్కారుగా ముందుకు సాగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నదాతను నిండా ముంచిదన్నారు. గత ఐదేళ్లలో రైతులకు ప్రయోజనం కలిగే ఎటువంటి కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నదన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో ప్రతి రైతుకు రూ.6 వేలు చొప్పున జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1,03,864 మంది బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.62.32 కోట్లు జమ చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. రైతుల అవసరాలు తీర్చుతూ వ్యవసాయాన్ని సంపూర్ణంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, జీసీసీ చైర్మన్ శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, తదితరులు అన్నదాత సుఖీభవ నమూనా చెక్‌ను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ఏఎంసీ చైర్మన్ డప్పోడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, టీడీపీ నేతలు పి.పాండురంగస్వామి, ఎస్.సుబ్బారావు, ఎ.సుబ్బలక్ష్మి, ఎల్.పార్వతమ్మ, డి.వెంకటకుమారి, రైతులు పాల్గొన్నారు.