Share News

నేటితో తొలి విడత నామినేషన్ల స్వీకరణ సమాప్తం

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:29 AM

జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనున్నది.

నేటితో తొలి విడత నామినేషన్ల స్వీకరణ సమాప్తం
జీకే వీధి సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేస్తున్న కూటమి బలపరిచిన అభ్యర్థి నాగమణి

రెండు రోజుల్లో సర్పంచులకు 324, వార్డులకు 498 నామినేషన్లు దాఖలు

పాడేరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనున్నది. తొలి విడతలో ఎన్నికలు జరిగే చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని మొత్తం 66 పంచాయతీలు, 686 వార్డులకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పదవులకు అభ్యర్థుల నుంచి ఈ నెల 15న నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా, ఈ నెల 17తో ఆ ప్రక్రియ ముగియనున్నది. దీంతో ఆది, సోమవారాలు కలిపి సర్పంచులకు 324, వార్డు స్థానాలకు 498 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారంతో గడువు ముగియడంతో ఆఖరు రోజున అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతాయని పలువురు భావిస్తున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:29 AM