Share News

గంజాయి రవాణా కేసులో ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:42 AM

గంజాయి రవాణా కేసులో ఇద్దరు ముద్దాయిలకు పది సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.హరినారాయణ సోమవారం తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.

గంజాయి రవాణా కేసులో ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష

రూ.లక్ష చొప్పున జరిమానా

చోడవరం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా కేసులో ఇద్దరు ముద్దాయిలకు పది సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.హరినారాయణ సోమవారం తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.

చోడవరంలోని గౌరీపట్నం జంక్షన్‌ సమీపంలో 2016వ సంవత్సరం సెప్టెంబరు రెండో తేదీన 148 కిలోల గంజాయిని రవాణా చేస్తూ ఒడిశా రాష్ట్రం చిత్రకొండకు చెందిన వంతల జయరాం, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం చినతమ్మెంగులకు చెందిన గొల్లూరి భీమరాజు చోడవరం పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బలంగా వాదనలు వినిపించారు. దీంతో ముద్దాయిలపై మోపిన అభియోగం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించారు.

Updated Date - Mar 10 , 2026 | 12:42 AM