Share News

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - May 25 , 2026 | 11:55 PM

జిల్లాలో సోమవారం ప్రారంభమైన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.శశికుమార్‌ తెలిపారు.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
చింతపల్లి జెడ్పీ స్కూల్‌లో పరీక్షకు హాజరైన విద్యార్థులు

తొలి రోజు 1,401 మంది విద్యార్థుల హాజరు

పాడేరురూరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం ప్రారంభమైన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.శశికుమార్‌ తెలిపారు. జిల్లాలోని 11 మండలాల్లో 24 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్‌ విద్యార్థినీ, విద్యార్థులు 1,522 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,401 మంది హాజరయ్యారని, మిగిలిన 121 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. దీంతో మొదటి రోజు తెలుగు పరీక్షకు 92.05 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే ఏపీవోఎస్‌ఎస్‌ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాలలో తెలుగు పరీక్షకు 295 మంది హాజరు కావాల్సి ఉండగా, 270 మంది హాజరయ్యారన్నారు. ఏపీవోఎస్‌ఎస్‌ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఇంగ్లీషు పరీక్షకు 49 మంది హాజరు కావాల్సి ఉండగా, 43 మంది హాజరయ్యారని తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 11:55 PM