Share News

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:11 AM

మండలంలోని కొత్త కొండెంపూడిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. వెండి పట్టీలు చోరీ చేసినట్టు అభియోగం మోపడంతో మనస్తాపం చెందిన బాలుడు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కొండెంపూడికి చెందిన తలారి మంగపతి, భవానీ దంపతుల రెండో కుమారుడు కృష్ణ (15) వడ్డాదిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ, వచ్చే నెలలో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తకొండెంపూడికి చెందిన దొండా సాయి, మణి దంపతుల ఇంటిలో వెండి పట్టీలు పోయాయి.

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

వెండి పట్టీలు చోరీ చేసినట్టు ఆరోపించడంతో మనస్తాపం

పశువులశాల వద్ద చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణం

బుచ్చెయ్యపేట ఫిబ్రవరి 19 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని కొత్త కొండెంపూడిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. వెండి పట్టీలు చోరీ చేసినట్టు అభియోగం మోపడంతో మనస్తాపం చెందిన బాలుడు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కొండెంపూడికి చెందిన తలారి మంగపతి, భవానీ దంపతుల రెండో కుమారుడు కృష్ణ (15) వడ్డాదిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ, వచ్చే నెలలో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తకొండెంపూడికి చెందిన దొండా సాయి, మణి దంపతుల ఇంటిలో వెండి పట్టీలు పోయాయి. వీటిని కృష్ణ అపహరించాడన్న అనుమానంతో బుధవారం అతనిని నిలదీశారు. తాను తీయలేదని మొత్తుకున్నా వారు వినలేదు. దీంతో కృష్ణ తీవ్రంగా కలత చెందాడు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి కూడా నిద్రించడానికి ఊరు చివరన ఉన్న పశువులశాల వద్దకు వెళ్లాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పాలు తీయడానికి పశువులశాల వద్దకు వెళ్లారు. కృష్ణ అక్కడ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కన్నీరుమున్నీరు అయ్యారు. సమాచారం అందుకొన్న పోలీసులు కొత్తకొండెంపూడి వెళ్లి పరిశీలించారు. తల్లిదండ్రులతోపాటు కొంతమంది గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని చోడవరం తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి మంగపతి ఇచ్చిన ఫిరాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Feb 20 , 2026 | 01:11 AM