Share News

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:05 AM

వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురవడంతో పాటు చలి సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నది.

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
పాడేరులో గురువారం ఉదయం దట్టంగా పొగమంచు

- ముంచంగిపుట్టులో 11.7 డిగ్రీలు

పాడేరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురవడంతో పాటు చలి సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నది. జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని మండలాల్లోనూ ఎండ ప్రభావం తగ్గడంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం పాడేరులో ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. కొయ్యూరులో గురువారం 15.7, హుకుంపేటలో 14.5, జి.మాడుగులలో 14.4, అరకులోయలో 13.8, అనంతగిరిలో 12.8, చింతపల్లిలో 12.6, పెదబయలులో 12.5, ముంచంగిపుట్టులో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో...

చింతపల్లి: మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం చింతపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ డి. ఆదిలక్ష్మి తెలిపారు. గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల చలి ఉధృతి పెరిగింది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలికి ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటల వరకు మంచు దుప్పటి వీడడం లేదు.

డుంబ్రిగుడలో...

డుంబ్రిగుడ: మండలంలో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడలేదు. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, చిన్నారులు ఇళ్లకే అవుతున్న వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం సాగించారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చిన్నారు, వృద్ధులు చితో ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రోజులు పాటు ఇదే పరిస్థీతి కొనసాగే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Nov 13 , 2026 | 01:05 AM