Share News

గిడుగు రామ్మూర్తి పురస్కారానికి తెలుగు ఉపాధ్యాయుడు ఎంపిక

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:49 AM

అనకాపల్లి మండలం కూండ్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోరాడ అప్పలరాజు, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికయ్యారు.

గిడుగు రామ్మూర్తి పురస్కారానికి తెలుగు ఉపాధ్యాయుడు ఎంపిక
కోరాడ అప్పలరాజు

తుమ్మపాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కూండ్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోరాడ అప్పలరాజు, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తెలుగు, సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించనున్న కార్యక్రమంలో అప్పలరాజు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. తెలుగు భాష, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలందించినందుకు అప్పలరాజును గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికచేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు.

Updated Date - Aug 29 , 2026 | 12:49 AM