Share News

సమస్యల్లో సాంకేతిక విద్య

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:57 PM

చోడవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కళాశాలకు ఇంతవరకు పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించలేదు. డిప్యూటేషన్‌పై నియమించిన అధ్యాపకులతోనే కళాశాలను నెట్టుకొస్తున్నారు. సొంత భవనం నిర్మించకపోవడంతో చాలీచాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు గచ్చుపైనే కూర్చోవాల్సి వస్తున్నది. పాత పంకుల భవనం కావడంతో వర్షం వస్తే కారిపోతున్నది.

సమస్యల్లో సాంకేతిక విద్య
బెంచీలు లేకపోవడంతో గచ్చుపై కుర్చున్న విద్యార్థులు

దయనీయంగా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

తొమ్మిదేళ్ల నుంచి పరాయి పంచన తరగతులు

వర్షం కురిస్తే కారిపోతున్న భవనాలు

తడిసిపోతున్న కంప్యూటర్లు, ఇతర సామగ్రి

భర్తీకాని అధ్యాపకుల పోస్టులు

ఇతర కళాశాలల నుంచి డిప్యూటేషన్‌పై నియామకం

ఫర్నిచర్‌ కొరతతో నేలబారు చదువులు

చోడవరం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): చోడవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కళాశాలకు ఇంతవరకు పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించలేదు. డిప్యూటేషన్‌పై నియమించిన అధ్యాపకులతోనే కళాశాలను నెట్టుకొస్తున్నారు. సొంత భవనం నిర్మించకపోవడంతో చాలీచాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు గచ్చుపైనే కూర్చోవాల్సి వస్తున్నది. పాత పంకుల భవనం కావడంతో వర్షం వస్తే కారిపోతున్నది.

తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు 2017లో చోడవరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరైంది. నూతన భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భవనాల్లో కళాశాలను ప్రారంభించారు. అప్పట్లో శిఽథిలావస్థలో ఉన్న భవనాలను నాటి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు ఇచ్చిన డెయిరీ నిధులతో భవనాలను ముస్తాబు చేసి తరగతులు ప్రారంభించారు. కాగా పాలిటెక్నిక్‌ కళాశాలకు సొంత భవనాల కోసం 2023లో ప్రభుత్వం వెంకన్నపాలెం వద్ద ఐదు ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. అప్పటి నుంచి స్థలం ఖాళీగానే వుంది. ఇక్కడ ఉన్నత పాఠశాల భవనాల్లోనే కళాశాలను కొనసాగిస్తున్నారు.

డిప్యూటేషన్‌పై అధ్యాపకులు

చోడవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు రెగ్యులర్‌ లెక్చరర్‌ పోస్టులను ఇంతవరకు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఇతర కళాశాలల లెక్చరర్లను డిప్యూటేషన్‌పై నియమించి బోధన సాగిస్తున్నారు. కంప్యూటర్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ బ్రాంచీలు కలిగి ఉన్న ఈ కళాశాలలో సీట్లకు డిమాండ్‌ అధికంగా వుంది. దీంతో అన్ని సీట్లు భర్తీ అవుతున్నాయి. ప్రస్తుతం 337 మంది విద్యార్థులు వున్నారు. కానీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేరు. ఎలక్ర్టానిక్స్‌ విభాగానికి ఒకహెచ్‌వోడీ, ఆరుగురు లెక్చరర్లు, కంప్యూటర్స్‌కు ఒక హెచ్‌వోడీ, ఆరుగురు లెక్చరర్లు, జనరల్‌ విభాగంలో ఆరుగురు లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌ కలిపి మొత్తం 21 మంది వుండాలి. కానీ ప్రస్తుతం ప్రిన్సిపాల్‌, మరో ఇద్దరు లెక్చరర్లు కలిపి మొత్తం ముగ్గురు మాత్రమే రెగ్యులర్‌ లెక్చరర్లు ఉన్నారు మిగిలిన వారంతా వివిధ కళాశాలల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చివారే!

వర్షం పడితే కారిపోతున్న భవనాలు

కళాశాల నిర్వహిస్తున్న పెంకుటి భవనాలు పురాతనమైనవి కావడంతో వర్షం కురిస్తే కప్పు నుంచి నీరు కారుతున్నది. పైగా సాంకేతిక పరికరాలు, కంప్యూటర్లు తడవకుండా వుండేందుకు అధ్యాపకులు, విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు. వర్షాకాలంలో వీటిపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పివుంచుతున్నారు. వసతి కొరత కారణంగా ల్యాబ్‌ సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. అంతేకాక సరిపడ బెంచీలు లేకపోవడంతో కొన్ని సెక్షన్ల విద్యార్థులు గచ్చుపైనే కూర్చోవాల్సి వస్తున్నది. ఇక పాలిటెక్నిక్‌ కళాశాలకు సొంత భవనాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం వెంకన్నపాలెం వద్ద ఐదు ఎకరాలు కేటాయించింది.. కానీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి పాలిటెక్నిక్‌ కళాశాలకు సొంత భవనాల నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని, అన్ని సబ్జెక్టులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:57 PM