అమరావతికి చట్టబద్ధతపై పాడేరులో టీడీపీ బైక్ ర్యాలీ
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:16 PM
రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం పాడేరు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
పాడేరురూరల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం పాడేరు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కుమ్మరిపుట్టులోని గిడ్డి ఈశ్వరి నివాసం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ తలారిసింగి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాలు సెంటర్, అంబేడ్కర్ కూడలి, మెయిన్ బజార్, సుండ్రుపుట్టు మీదుగా కుమ్మరిపుట్టు వరకు చేరింది. ర్యాలీలో జై అమరావతి.. జైజై అమరావతి.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదేళ్ల పాలనలో మూడు ముక్కలాట ఆడిన జగన్‌రెడ్డికి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం చెంపపెట్టు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్యనాయకులు బొర్రా నాగరాజు, బొర్రా విజయరాణి, డప్పోడి వెంకటరమణ, డీవీ కుమారి, ఎ.సుబ్బలక్ష్మి, ఎల్.పార్వతమ్మ, దన్నేటిపలాసి సురేష్‌కుమార్, ఆర్.కొండబాబు, కొట్టగుళ్లి రమేష్ నాయుడు, బొంజుబాబు పాల్గొన్నారు.