క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షలో ప్రతిభ
ABN , Publish Date - May 05 , 2026 | 12:45 AM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గిరిజన విద్యార్థినులు క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ డాకర్ ఎం. విజయభారతి తెలిపారు.
- సత్తాచాటిన ముగ్గురు డిగ్రీ విద్యార్థినులు
చింతపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గిరిజన విద్యార్థినులు క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ డాకర్ ఎం. విజయభారతి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షను స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థినులు విశాఖపట్నంలో రాశారన్నారు. ద్వితీయ సంవత్సరం బీఏ విద్యార్థిని ఆర్.విమోచన, ప్రథమ సంవత్సరం బీఎస్సీ విద్యార్థినులు సీహెచ్. భవాని, వి.కృష్ణవేణిలు ఉత్తీర్ణులయ్యారన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షలో రాణించిన ఆ ముగ్గురు విద్యార్థునులను మంగళవారం విజయవాడ ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో సత్కరించేందుకు ఏపీఎస్‌హెచ్‌ఈ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. కళాశాల విద్యార్థినులు జాతీయ స్థాయి క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ ఆర్.రవీంద్రనాయుడు పాల్గొన్నారు.