Share News

రేపటి నుంచి టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:12 AM

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 28న జరగనున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రతినిధులు బుధవారం ప్రకటించారు.

రేపటి నుంచి టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం

ఆన్‌లైన్‌లో మాత్రమే...

టికెట్‌ ధరలు కూడా ప్రకటించని ఏసీఏ!

విశాఖపట్నం-స్పోర్ట్స్‌,

జనవరి 21 (ఆంధ్రజ్యోతి):

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 28న జరగనున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. టికెట్ల అమ్మకాలు డిస్ర్టిక్‌ బై జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతాయని, ఆఫ్‌లైన్‌లో ఉండవని స్పష్టంచేశారు. సీట్లకు నంబరింగ్‌ విధానం ఉంటుందని, ప్రేక్షకులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలన్నారు. అయితే టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల ధరలను ప్రకటించకుండా నిర్వాహకులు కొత్త సంస్కృతికి తెరతీశారు. గతంలో ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో చేపట్టే అమ్మకాలకు సంబంధించి టికెట్ల ధరలను ప్రకటించేవారు. అయితే ఈసారి టికెట్ల ధరలను వెల్లడించలేదు.

Updated Date - Jan 22 , 2026 | 01:12 AM