చిలకడదుంప ధర పతనం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:41 AM
చిలకడదుంప, అల్లం ధరలు పతనమయ్యాయి. గత వారంతో పోలిస్తే సగానికి ధరలు పడిపోయాయి. మండలంలోని కించుమండ బుధవారం సంతకు రైతులు విరివిగా చిలకడదుంపలు, అల్లం తీసుకువచ్చారు. అయితే వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి. గత వారం 35-40 కిలోల మధ్య ఉండే చిలకడదుంపల బస్తా రూ.1,200 పలకగా, ఈ వారం రూ.700కు, అలాగే గత వారం కిలో రూ.23కు విక్రయించిన అల్లం ఈ వారం రూ.12లకు అమ్ముకోవలసి వచ్చింది. తమ కష్టానికి తగ్గ ఫలితం రాలేదని రైతులు వాపోయారు.
- అల్లం కూడా..
- గత వారంతో పోలిస్తే వారపు సంతలో సగానికి పడిపోయిన రేటు
డుంబ్రిగుడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): చిలకడదుంప, అల్లం ధరలు పతనమయ్యాయి. గత వారంతో పోలిస్తే సగానికి ధరలు పడిపోయాయి. మండలంలోని కించుమండ బుధవారం సంతకు రైతులు విరివిగా చిలకడదుంపలు, అల్లం తీసుకువచ్చారు. అయితే వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి. గత వారం 35-40 కిలోల మధ్య ఉండే చిలకడదుంపల బస్తా రూ.1,200 పలకగా, ఈ వారం రూ.700కు, అలాగే గత వారం కిలో రూ.23కు విక్రయించిన అల్లం ఈ వారం రూ.12లకు అమ్ముకోవలసి వచ్చింది. తమ కష్టానికి తగ్గ ఫలితం రాలేదని రైతులు వాపోయారు.