గోవాడ చెరకు రైతులకు తీపి కబురు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:56 AM
గోవాడ చెరకు రైతులకు సుమారు రూ.29 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం అతి త్వరలోనే చెల్లించనుందని జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీల సమస్యలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం విశాఖ వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి గోవాడ చెరకు రైతుల బకాయిలు గురించి మాట్లాడినట్టు ఆయన చెప్పారు.
రూ.29 కోట్ల బకాయిలు చెల్లించేందుకు క్యాబినెల్ సబ్‌క మిటీ ఆమోదం
జనసేన పార్టీ చోడవరం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌రాజు
చోడవరం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గోవాడ చెరకు రైతులకు సుమారు రూ.29 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం అతి త్వరలోనే చెల్లించనుందని జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీల సమస్యలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం విశాఖ వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి గోవాడ చెరకు రైతుల బకాయిలు గురించి మాట్లాడినట్టు ఆయన చెప్పారు. చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని క్యాబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్టు మనోహర్ చెప్పారన్నారు. గోవాడ చెరకు రైతులకు త్వరలోనే బకాయిలు అందుతాయనిఇ మంత్రి స్పష్టం చేశారన్నారు.